శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భద్రతా లోపం పై వెంటనే చర్యలు తీసుకోవాలి
అక్షర విజేత ద్వారకాతిరుమల
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయ పడమర రాజగోపురం పై నీటి నిలవ లీకేజ్ భద్రతా లోపంపై వెంటనే చర్యలు తీసుకోవాలని వినతి ఇచ్చారు ఏలూరు జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఇటీవల కాలంలో గమనించిన ఒక కీలక సమస్యపై మీ దృష్టిని ఆకర్షించుదలచుకుంటున్నాం ఆలయ పడమర వైపు రాజగోపుర స్లబ్ మీద వర్షపు నీరు నిలిచిపోయి అక్కడి స్లబ్ లీక్ అవుతూ మీరు ఆలయ గోడల చుట్టూ కారుతుంది ఈ పరిస్థితి వల్ల ఆలయ నిర్మాణ దృఢత్వానికి భద్రత సమస్యలు తలెత్తి అవకాశం ఉంది దీర్ఘకాలికంగా చూస్తే గోపుర నిర్మాణం పాడైపోయే ప్రమాదం ఉంది భక్తుల నడకమార్గాల్లో నీరు కారడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది ప్రధానంగా ఆలయ పవిత్రతకు మరియు భక్తులు భద్రతకు ఇది పెద్ద సంబంధమైన అంశం అయినా ఆలయ అధికారులు ఇప్పటివరకు ఈ విషయంలో స్పందించకపోవడం భక్తుల్లో ఆందోళనకు కారణమైంది ఇది ఉపేక్షించదగినది విషయం కాదు ఆలయ ఒక మహా పుణ్యక్షేత్రంగా భక్తుల విశ్వాసానికి ప్రతీక అటువంటి ప్రదేశంలో నిర్మాణ లోపాలను సమర్థవంతంగా పరిగణించకపోతే అది పరిపాలన విపలతకు చిహ్నంగా మారుతుంది కాబట్టి ఈ విషయాన్ని అత్యవసరంగా పరిశీలించి స్లబ్ పై నీటి నిల్వ తొలగించడం లీకేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనటం వంటి చర్యలు తక్షణమే చేపట్టమని వినమరంగా కోరుతున్నారు